టీనేజర్లపై ఫ్రాంచైజీల కాసుల వర్షం

క‌లం, స్పోర్ట్స్‌: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2027 వేలం (WPL 2027 Auction) లో టీనేజర్లు సంచలనం సృష్టించారు. 15 ఏళ్ల ఉమా కాశ్వి, 16 ఏళ్ల సమైరా రాఘవ్‌లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం కొచ్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో కర్ణాటకకు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఉమా కాశ్విని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు దక్కించుకుంది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఆటగాడిగా ఉమా రికార్డు సృష్టించింది.

మరోవైపు ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల ఆల్‌రౌండర్ సమైరా రాఘవ్‌ను గుజరాత్ జెయింట్స్ కూడా రూ.10 లక్షలకే కొనుగోలు చేసింది. కాగా WPL ఐదో సీజన్ 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. ఈ పరిణామంపై గురువారం బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పందించారు. ఈ వేలంలో ఫ్రాంచైజీలు ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనే వ్యూహాన్ని అనుసరించాయని ఆయన తెలిపారు. 15 ఏళ్ల ఉమా కాశ్వి ఎంపిక కావడం లీగ్‌కే కొత్త కళ తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈసారి వేలంలో కేవలం 27 ఖాళీల కోసం ఏకంగా 150 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారని మన్హాస్ వెల్లడించారు. భారతదేశంలో మహిళల క్రికెట్ ఏ స్థాయిలో తీవ్రమైన పోటీతో ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఇలాంటి లీగ్స్ ద్వారా క్రీడాకారులు ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకుంటారని మన్హాస్ తెలిపారు. ఇది భారత క్రికెట్ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని, లీగ్ పోటీ పెరిగే కొద్దీ అభిమానుల సంఖ్య కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>