‘పీఎం రాహ‌త్‌’పై ఎస్పీ జాన‌కి కీల‌క సూచ‌న‌లు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో అత్యవసర వైద్య చికిత్స అందించి, విలువైన ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకం (PM Rahat Scheme)పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులు నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు, గరిష్ఠంగా 7 రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, వారికి తక్షణ వైద్య సహాయం అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో నిర్లక్ష్యం చేయకుండా, మానవతా దృక్పథంతో స్పందించి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ సూచనలు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ అన్నారు. అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించి, అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని జిల్లా ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>