కలం, వెబ్ డెస్క్ : బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన సవాల్ విసిరారు. ఎన్నికల తీరుపై నమ్మకం ఉంటే పార్లమెంటును రద్దు చేసి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
పోరాడకపోతే ప్రజలు మేల్కొనరు :
సీఈసీ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని ఖర్గే ఆరోపించారు. ఓట్ చోరీ, సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నారు. అయితే, ఈ నిరసనల్లో సీజేపీ పాల్గొనదని ఆయన చెప్పారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని.. ప్రజాస్వామ్యంలో పోరాడకపోతే ప్రజలు మెల్కొనరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్)లు నాలుగు స్థానాలనూ గెలుచుకోవడంపై ఖర్గే స్పందించారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంటుందని ఆయన (Mallikarjun Kharge) తేల్చిచెప్పారు.
Also Read : సైబర్ బాధితులకు రిలీఫ్.. బ్యాంకులదే బాధ్యత!
Follow Us On: Youtube

