విద్యార్థిని మృతిపై అనుమానాలు.. సమగ్ర విచారణకు ఎమ్మెల్యే డిమాండ్

కలం,మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ (Raghavapur) కస్తూర్బా హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న గుడికందుల గ్రామానికి చెందిన లాస్య అనే విద్యార్థిని అనుమస్పద మృతి చెందింది. విద్యార్థిని పుష్పవతి అయిన అనంతరం తీవ్ర రక్తస్రావంతో బాధపడినట్లు సమాచారం. రాత్రంతా హాస్టల్‌లోనే (Kasturba Hostel) ఉన్నప్పటికీ, ఆమెకు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ఈ మృతి సంభవించిందని ఆరోపణలు వస్తున్నాయి.

లాస్య మృతికి ​హాస్టల్ నిర్వాహకుల, హాస్టల్ వార్డెన్ తీవ్ర నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో విద్యార్థిని (Student) లాస్య మృతదేహాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతికి సంబంధించిన పలు అనుమానాలను ప్రస్తావిస్తూ,లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>