కలం, ఇచ్చోడ: ఇచ్చోడ (Ichoda) మండలం సాత్ నంబర్, ఇస్లాంనగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వివో భవనాల (VIVO Buildings) నిర్మాణ పనులకు గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.
వివో భవనాల నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ రాథోడ్ రమేష్, ఉపసర్పంచ్ షబ్బీర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గాడ్గే సుభాష్, మనోహర్, రోహిదాస్, న్యాజ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

