భూ భారతి పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టి సారించాలి : వెంకారెడ్డి

కలం, యాదగిరిగుట్ట : భూ సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియతో పాటు భూ భారతి (Bhu Bharati) కింద అందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో రీ-సర్వే పురోగతి, భూ భారతి దరఖాస్తులు, పెండింగ్‌ సమస్యలపై సమీక్షించారు.

నిర్దేశిత లక్ష్యాల మేరకు రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని, భూ భారతి దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో రోజువారీగా సాధించిన పురోగతిపై నివేదికలు సమర్పించాలని, పెండింగ్‌ అంశాలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>