ఇంటి నిర్మాణ అనుమతులు అడిగితే తహశీల్దార్ దురుసు ప్రవర్తన

కలం, మెదక్ బ్యూరో: ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంపై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సిద్దిపేట (Siddipet) రూరల్ తహశీల్దార్ అబ్దుల్ రహ్మాన్ మాట్లాడిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బండచార్లపల్లికి చెందిన బాధితుడు రంజిత్ కుమార్ కలెక్టర్‌కు వాట్సాప్ ద్వారా వీడియో పంపి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బుధవారం గ్రామానికి వచ్చిన తహశీల్దార్‌ను గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన అనుమతుల గురించి రంజిత్ కుమార్ అడగగా, ఆయన దురుసుగా మాట్లాడారని బాధితుడు ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి సుడా అధికారులు అనుమతులు ఇస్తున్నారని చెప్పినప్పటికీ, తనపై బెదిరింపు ధోరణిలో తహశీల్దార్ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు రంజిత్ కుమార్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>