పీఎం రాహత్ పథకంపై నిర్మ‌ల్‌ కలెక్టర్ స‌మీక్ష‌

కలం, నిర్మల్: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించడంతో పాటు, ప్రాణనష్టాన్ని నివారించే లక్ష్యంతో పీఎం రాహత్ పథకాన్ని (PM Rahat Scheme) జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం రాహత్ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకం అమలులో నిర్లక్ష్యం వహించకుండా, బాధితులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, అమలును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు తిరుపతి, అసీఫ్, రజినీకాంత్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>