అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల‌ను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించింద‌ని, విస్తృతంగా ఓటరు నమోదు చేయించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌న‌గర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత పట్టభ‌ద్రుల ఓటరు నమోదు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ ఓటు హక్కు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. జిల్లాలో పట్టభద్ర ఓటర్ల నమోదు చాలా తక్కువగా ఉందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన వారు వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని ఆధార్, ఓటర్ ఐడీ, డిగ్రీ మెమో జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఓటర్ నమోదు కేంద్రాలను చేయడం జరిగిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ప్రస్తుత ఎన్నికల కోసం మళ్లీ కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందర్నీ గుర్తించి, నవంబర్‌ 6 నాటికి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపి సహకరించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు ఖలీం, సిద్ధిక్, బషీర్, శ్రీనివాస్ రెడ్డి, మక్సూద్, సుధాకర్, సత్యం యాదవ్, శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>