ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ సంఘీభావం

కలం, ఆదిలాబాద్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల (NHM Employees) న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ (MLA Anil Jadhav) డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో 16 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఆయన బుధవారం సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు గత 20 ఏళ్లుగా కీలక సేవలందిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>