రైతు గర్జన సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

కలం, ఆదిలాబాద్‌: నవంబర్‌ 1న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభను (Rythu Garjana Sabha) విజయవంతం చేయాలని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ (MLA Anil Jadhav) పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని, రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరవుతారని వెల్లడించారు. గతంలో కేసీఆర్‌ రైతులకు అండగా నిలిచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. సభలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కేటీఆర్‌ పరామర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి సభ నిర్వహించే డైట్‌ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. రైతులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>