విద్యార్థులకు ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన.. క్విజ్ పోటీలు

కలం, జగిత్యాల : తెలంగాణ మోడల్ స్కూల్ కండ్లపల్లిలో (Kandlapalli ) ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బుధవారం ఈ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సుతో (E-Waste Awareness Program) పాటు క్విజ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ-వేస్ట్ అంటే ఏమిటి, వాటిని ఎలా సేకరించాలి, సరైన పద్ధతుల్లో నిర్వహించకపోతే పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలుగుతుందనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన.. క్విజ్ పోటీలు

ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటికి సంబంధించిన పనికిరాని వస్తువులను నిర్లక్ష్యంగా పడేయకుండా, ప్రత్యేక పద్ధతుల్లో సేకరించి, ప్రభుత్వం సూచించిన సంస్థలకు అందించాలని కార్యక్రమంలో వివరించారు. ఈ-వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, వాటిలోని ఉపయోగకరమైన పదార్థాలను రీసైక్లింగ్ ద్వారా తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు. తద్వారా వివిధ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పాఠశాలలో వ్యర్థ పదార్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు రంగుల డస్ట్‌బిన్ల వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా ఈ-వేస్ట్‌ను ఇతర చెత్తతో కలపకుండా, దాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నల్ల రంగు డస్ట్‌బిన్‌లో సేకరించాలని సూచించారు. అనంతరం వాటిని నిర్దేశిత సంస్థలకు అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ ద్వారా ఈ-వేస్ట్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై వారి అవగాహనను పెంపొందించారు.

తమ ఇళ్ల నుంచి ఈ-వేస్ట్‌ను సేకరించి పాఠశాలకు తీసుకొచ్చిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ డి. సరితా దేవి, ప్రిన్సిపల్ నగేష్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎకో క్లబ్ విద్యార్థులు, ఎకో క్లబ్ ఇన్‌చార్జ్, ఈ-వేస్ట్ కోఆర్డినేటర్ సి.శివకృష్ణతో పాటు ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీలకు కండ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థి సాత్విక్ ఎంపిక

జగిత్యాల జిల్లా కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి సాత్విక్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-14 విభాగం కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

చిన్న వయసులోనే క్రీడల్లో ప్రతిభ చాటుతూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డి. సరితా దేవి, వైస్ ప్రిన్సిపాల్ నాగేష్, పీడీలు అజీమ్, వినీత్‌తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థి సాత్విక్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>