ఇచ్చోడ తాండ అభివృద్ధికి రూ. 40 లక్షలు.. పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే!

కలం, ఇచ్చోడ: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. ఇచ్చోడ మండలం ఇచ్చోడ తాండ (Ichoda Thanda) గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించనున్న వివో భవనానికి, రూ.30 లక్షలతో చేపట్టనున్న గోడౌన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ భవనాలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>