కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేక రైలు కేటాయించకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే నిలయం (Secunderabad Railway Station)లోని జనరల్ మేనేజర్ (GM) కార్యాలయం ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా (Congress Protest) నిర్వహించారు.
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగానే తమకు రైలు సౌకర్యాన్ని నిరాకరిస్తోందని ఆరోపిస్తూ నాయకులు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల ప్రజాస్వామ్య నిరసన హక్కును అణచివేయడానికే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రైలు ఇవ్వకపోయినా తమ ప్రయాణాన్ని ఆపలేరని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగానైనా ఢిల్లీకి చేరుకుని తీరుతారని స్పష్టం చేశారు. ఈ నిరసన (Congress Protest) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
మంత్రి పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్ 1వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సన్నాహకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నా నిర్వహిస్తున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు రైల్వే ప్రాంగణం వద్ద నిరసన తెలపడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఢిల్లీ టూర్ ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు బ్రేక్?
Follow Us On : WhatsApp

