కరీంనగర్‌లో నేటి నుంచి యజ్ఞవరాహస్వామి 40వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌ (Karimnagar) లోని సర్వవైదిక సంస్థానమ్ ట్రస్ట్, యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీ యజ్ఞవరాహస్వామి (Yagna Varaha Swamy) చత్వారింశతమ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ బుధవారం నుండి నవంబర్ 2వ తేదీ సోమవారం వరకు జరగనున్నాయి.

ఈ పవిత్ర మహోత్సవానికి హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును ఆలయ కమిటీ సభ్యులు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేందర్, వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి, రాణి, రవీందర్ రావులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్రీ యజ్ఞవరాహస్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>