ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్ ల బదిలీ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ బదిలీలలో భాగంగా, HMDA పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను EFS & T శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే ఆయనకు EPTRI డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

YAT&C శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వాణి ప్రసాద్‌కు క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు ఇచ్చారు. పిఆర్ & ఆర్‌డి, ఆర్‌డబ్ల్యూఎస్ & ఆర్‌ఎస్‌ఎడి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్ మిట్టల్ నియమితులయ్యారు. షైలజా రామయ్యర్‌ను రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇలంబరితి కె.ను రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు HMDA పరిధిలోని అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా FAC బాధ్యతలు కేటాయించారు. శ్రుతి ఓజాను WCD & SC శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎమ్‌డి మహమ్మద్ ముషారఫ్ అలీ ఫారూఖీని హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు ఇచ్చారు. డాక్టర్ S.సంగీత సత్యనారాయణను WCD & SC డైరెక్టర్‌గా, జితేష్ V పాటిల్‌కు TGREDCO విసి & మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు కేటాయించారు.

Also Read : ప్రభుత్వ తీరుపై మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>