కలం, వనపర్తి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్రదాస్ పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి సిద్ధేశ్వర్, ఎస్ఐఆర్ ప్రక్రియ కోఆర్డినేటర్ శత్రురావు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 500 మంది, మున్సిపాలిటీల పరిధిలో కనీసం వెయ్యి మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని నాయకులకు సూచించారు. మండల అధ్యక్షులు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా చొరవ తీసుకోవాలన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓటరు జాబితాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నవంబరు 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ మహాధర్నాలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంకిని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేర్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, టౌన్ అధ్యక్షులు కదిరే రాములు, మండల అధ్యక్షులు రవి కిరణ్, మున్సిపల్ కౌన్సిలర్లు మహేశ్వరి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్య శీలా రెడ్డి , మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, పెబ్బేర్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, గోపాల్పేట మండలం అధ్యక్షులు నరహరి, రేవల్లి మండల అధ్యక్షులు సుల్తాన్, ఏదుల మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, పెద్దమందడి మండల అధ్యక్షుడు వెంకటస్వామి, గణపురం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, శ్రీరంగపురం మండల అధ్యక్షులు విష్ణు ముదిరాజ్, మన్యం, యాదగిరి వాల్మీకి, సర్పంచులు రాములు, వాలియా నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆదిత్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్, శివ కుమార్ నాయుడు, ఎన్ఎస్యూఐ నాయకులు శ్రీకాంత్, రోహిత్, అన్ని మండలాల టౌన్ బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

