కలం, నేరడిగొండ: పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారం కాకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. నేరడిగొండ (Neradigonda) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహ సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Also Read : ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్ ల బదిలీ
Follow Us On: Instagram

