ప్రభుత్వ తీరుపై మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూసీ బాధితుల పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లకుండా తనను, తన కుమారుడు కార్తీక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలన సాగిస్తోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు నీళ్లు లేక, పంటలు ఎండిపోయి అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా మూసీ ప్రాజెక్టు (Musi Project) కోసం వేల కోట్లు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు.

కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా, కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పంట ఎండిపోతే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకునే దుస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొందని సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కన్నీరు కారుస్తుంటే మూసీ ప్రాజెక్ట్ మీద ప్రభుత్వానికి ఎందుకంత తొందరని ఆమె ప్రశ్నించారు.

Also Read : ఉమ్మడి వరంగల్‌ వైపుకి ‘అర్నబ్’ తుఫాన్.. ఉపశమనమా? ముప్పా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>