దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: ఏలేటి, రామారావు పటేల్‌

కలం, భైంసా : దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్‌, ఇతర శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy), పవార్‌ రామారావు పటేల్‌ (Pawar Ramarao Patel) అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలో ముధోల్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో విధ్వంసం సృష్టించేందుకు రాహుల్‌ గాంధీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి ఆరోపణలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్‌ 3న నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జన సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ముధోల్‌ నియోజకవర్గం నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>