నవంబర్‌ 1న చలో ఢిల్లీని విజయవంతం చేయండి: కూచాడి శ్రీహరిరావు

కలం, నిర్మల్‌: ఓటు బచావో.. దేశ్‌ బచావో నినాదంతో నవంబర్‌ 1న కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని(Chalo Delhi Program) విజయవంతం చేయాలని నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న నాయకులతో కలిసి ప్రత్యేక బస్సును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ దశరథ రాజేశ్వర్‌, నాయకులు నాందేడపు చిన్ను, ఓస రాజేశ్వర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, వేణు, సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>