బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కు.. మేయప్పన్‌ సంచలన వ్యాఖ్యలు

కలం, నిర్మల్‌: బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పరిశీలకుడు సీడీ మేయప్పన్‌ (AICC Secretary Meyyappan) ఆరోపించారు. మంగళవారం నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని విమర్శించారు.

ఓటు చోరీ అంశంలో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పోరాటం సాగిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో ర్యాలీకి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాల ఇన్చార్జిలు కూచాడి శ్రీహరిరావు, నారాయణరావు పటేల్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శులు గాజుల రవికుమార్‌, జునైత్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>