కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ వింత (BJP Leaders) నిరసన చేపట్టారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (Madhavanagar ROB)వద్ద బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బ్రిడ్జి వద్ద భిక్షాటన చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కూడా ఉన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్‌ఓబీ పనులు ఆలస్యాన్ని నిరసిస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మాధవనగర్ వద్ద నిరసన దీక్షలో భాగంగా ఈ బిక్షాటన చేపట్టారు.
నిరసన దీక్షకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. దీక్ష అనంతరం ఎంపీ అర్వింద్ (MP Arvind) భిక్షాటన నిర్వహించారు. బీజేపీ నాయకులు(BJP Leaders), ప్రజల నుంచి, అలాగే బైపాస్ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల నుంచి ఆర్‌ఓబీ కోసం నిధులు సమీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించక పోవడంతో ఆర్‌ఓబీ జాప్యం అవుతోందని దానివల్ల ప్రయాణీకులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని నేతలు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో సైతం ధర్మపురి అరవింద్ ఆర్‌ఓబీ కోసం బిక్షాటన అంటూ పోస్టులు పెట్టారు.
Also Read : మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. కోతలు షురూ!
Follow Us On : WhatsApp

