బ్రిడ్జి పూర్తి కోసం బిక్షాటనకైనా సిద్ధం: ఎంపీ అర్వింద్

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. మాధవనగర్ ఆర్‌ఓబీ (Madhavanagar ROB) పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. దీక్షలో బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) , ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. బీజేపీ నిరసన దీక్షలో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. మాధవనగర్ ఆర్‌ఓబీ పనుల పూర్తి కోసం బిచ్చం అడుగుతున్నా అని వ్యాఖ్యానించారు. మాధవనగర్ ఆర్ ఓ బ్రిడ్జి నాకు రెండవ అతి ప్రాధాన్యత గల పని అన్నారు.

మాధవనగర్ ఆర్‌ఓబీ కోసం తాను నిరసన దీక్ష ప్రకటించగానే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనీ దుయ్యబట్టారు. అంచనా వ్యయం పెంపు అనుమతుల కోసం 2024 అక్టోబర్ నుండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉంచారనీ చెప్పుకొచ్చారు. 1980 నుండి ఈ ఆర్‌ఓబీ అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుందని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపీగా ఉన్నపుడు కమిషన్‌ల కోసం కాంట్రాక్టర్లను వేధించారనీ ఆరోపించారు.

అందుకే కాంట్రాక్టర్లు పని ఒదిలేసి పారిపోయారనీ ఆరోపించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను పాతాళంలోకి తొక్కుతున్నా అనే కోపంతో నిధులు ఇవ్వటం లేదనీ అన్నారు. కేంద్ర రైల్వే శాఖ నుండి ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో ఉండదనీ ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిలు ఉన్నా నిజామాబాద్ ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందనీ విమర్శించారు. స్వంత సంపద పెంచుకోవడమే ఇద్దరు నేతల సహాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలను పక్కనపెట్టి మాధవనగర్ ఆర్‌ఓబీ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>