కలెక్టర్ గైర్హాజరు.. నిర్మల్ ప్రజావాణి అధికారుల తీరుపై విమర్శలు!

కలం, నిర్మల్‌ : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (Nirmal Prajavani) కార్యక్రమం నిర్మల్‌ జిల్లాలో మొక్కుబడిగా సాగిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు విన్నవిస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజావాణికి వస్తుంటారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఒకేచోట అందుబాటులో ఉండటంతో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తారు.

అయితే సోమవారం జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా (Collector Bhavesh Mishra) బాసర పర్యటనకు వెళ్లడంతో ప్రజావాణిలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. కలెక్టర్‌ లేరని కొందరు అధికారులు మొబైల్‌ ఫోన్లలో నిమగ్నమవగా, మరికొందరు ముచ్చట్లలో మునిగిపోయినట్లు కనిపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అర్జీదారుల పట్ల తగిన శ్రద్ధ చూపడం లేదనే అసంతృప్తి వ్యక్తమైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన ప్రజావాణి, అధికారుల తీరుతో మొక్కుబడి కార్యక్రమంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read : దూసుకొస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>