దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మాదాపూర్ దుర్గం చెరువు (Durgam Cheruvu)లో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. దుర్గం చెరువులో మృతదేహం వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని నాచారంలో ఓ హాస్టల్ లో ఉంటున్న రాజేశ్.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి సోమవారం తన మిత్రులను కలిసేందుకు వచ్చారు. అనంతరం అక్కడినుంచి కేబుల్ బ్రిడ్జి పైకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారు. రాజేశ్ సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సదరు వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read : మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. కోతలు షురూ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>