వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ‘సైకిల్ ర్యాలీ’

కలం, హనుమకొండ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో (Warangal Police) మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రైసిటీలోని వివిధ సైక్లిస్ట్ బృందాల సభ్యులు సహా సుమారు 200 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ ర్యాలీ ఘనమైన నివాళి అని తెలిపారు. సైక్లింగ్ వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ర్యాలీలో 89 ఏళ్ల వయసులో పాల్గొన్న మామిడి నర్సయ్యను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఉత్సాహం యువతతో పాటు అన్ని వయసుల వారికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఏఆర్ అదనపు డీసీపీలు వి. శ్రీనివాస్, సురేష్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్‌లను కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది, నగరంలోని వివిధ సైక్లిస్ట్ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>