సారపాకలో పోలీసుల కార్డన్‌ సెర్చ్.. ‌ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు!

కలం, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశాల మేరకు.. పాల్వంచ డీఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka) సుందరయ్య నగర్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ (Cordon and Search Operation) నిర్వహించారు. డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువపత్రాలు లేని బైక్‌లు, ఆటోలను గుర్తించారు. వాహనాల పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ ఆపరేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్‌ పార్టీ, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు.

Also Read : కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ చేశారు: హరీష్ రావుపై చామల ఫైర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>