ఇల్లెందులో తీవ్ర కలకలం.. ఒకే ఇంట్లో యువకుడు, వివాహిత మృతి!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో (Yellandu Deaths) ఒకే ఇంట్లో యువకుడు, వివాహిత విగతజీవులుగా మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని దాసరి గడ్డకు చెందిన టి.శ్రీనివాస్ (22) పాత ఇనుప సామాన్ల కొనుగోలు, అమ్మకం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన అత్త వరుస అయ్యే వివాహిత కె.కల్యాణి (34)తో గత కొన్ని నెలలుగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో 18 రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోవడంతో, శ్రీనివాస్ తల్లి దుర్గమ్మ, కల్యాణి భర్త సాలయ్య వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

​సోమవారం రోజున దాసరి గడ్డలోని శ్రీనివాస్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి తలుపులు తీసి చూడగా శ్రీనివాస్, కల్యాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సిఐ సురేష్ సిబ్బందితో కలిసి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. అయితే ఇద్దరి మృతిపై అనుమానాలున్నాయని, ఇది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో పోలీసులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని పలువురు ఎస్సీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>