కలం, హనుమకొండ: బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు గతంలో జరిగిన పరిణామాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో అభియాన్’లో భాగంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాగరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, కేటీఆర్ లపై పౌరుష పదజాలం ఉపయోగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని అన్నారు.
ఓటర్ల హక్కుల పరిరక్షణకు పోరాటం
ఓటరు జాబితాల్లో అక్రమాలు, ఓట్ల తొలగింపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు నాగరాజు (KR Nagaraju) పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న పోరాటాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలి
ఓటు హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీలో చేపట్టనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగరాజు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, చైర్మన్లతో సమావేశమై కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభియాన్‌ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

