‘బిల్లులు ఇవ్వకుంటే చనిపోతా’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి, పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలన్నా డిమాండ్ చేశారు. లేకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహర దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. బిల్లుల కోసం తాను చనిపోవాల్సిందేనా? అంటూ అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.

‘నేను చనిపోతా అంటేనే బిల్లులు వస్తాయంటే, చావడానికి అయినా సిద్ధం. నా చావుకి రూ.40 కోట్లు విలువనా? లేదా నేను బతికి ఉండాలా? అనేది ప్రభుత్వం నిర్ణయించాలి’ అని అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన (Anirudh Reddy ) గుర్తు చేశారు.

అయినా, పనులకు సంబంధించి బిల్లుల మంజూరు విషయంలో ఆలస్యం జరుగుతోందని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. నియోజకవర్గంలోని రోడ్ల పనులు పూర్తి చేయడంతో పాటు బిల్లులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేనే బిల్లులు మంజూరుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : AEE పరీక్ష తేదీలో మార్పు.. TGPSC కీలక ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>