కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు మంగళవారం బహిరంగ వేలం (Vehicle Auction) నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ ఎన్. బిక్షపతి సోమవారం తెలిపారు. నల్లబెల్లం, నాటుసారా రవాణాకు సంబంధించిన కేసుల్లో తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనదలచిన వారు నిర్మల్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఉంచిన వాహనాలను స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఈఎండీను మంగళవారం ఉదయం 11 గంటల్లోపు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు.
Also Read : సోషల్ మీడియా రూమర్లపై రష్మిక ఘాటు రిప్లై!
Follow Us On : WhatsApp

