క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది: గద్వాల కలెక్టర్

కలం, జోగులాంబ గద్వాల: ప్రతిభ గల క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ మైదానంలో 70వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌ (Cricket Tournament) ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకొని, స్వయంగా కలెక్టర్ కాసేపు సరదాగా బ్యాటింగ్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 జట్లు గద్వాలకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారుల్లో సత్సంబంధాలు ఏర్పడడమే కాక క్రీడా స్ఫూర్తితో మెలిగేందుకు వివిధ ఆటలు దోహదపడతాయని తెలిపారు.

నాలుగు రోజులపాటు జరిగే పోటీల్లో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి డిసెంబర్ రెండో వారంలో గ్వాలియర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ స్టేడియంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో క్రీడల రాష్ట్ర పరిశీలకులు డేవిడ్, ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, స్టేడియం ఇన్చార్జి బషీర్, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>