కలం, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో అక్టోబర్ 27 మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి సీతక్క (Seethakka) బాన్సువాడకు రానున్నారు. మంత్రి సీతక్క పర్యటనకు సంబంధించి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేమయ్యారు.
ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి విజయవంతం చేయాలని పోచారం సూచించారు.
Also Read : తుమ్మిడిహెట్టికి మోక్షం?: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య బిగ్ డీల్!
Follow Us On: Youtube

