చర్లలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై బ్లేడుతో దాడి!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలోని గొమ్ముగూడెం (Gommugudem) గ్రామంలో తీవ్ర కలకలం రేపిన ఉదంతం వెలుగు చూసింది. ఇంట్లో మంచంపై గాఢ నిద్రలో ఉన్న ఆకుల శ్యామసుందర్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన నర్రా కుమార్ బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. శ్యామసుందర్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నర్రా కుమార్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధితుడి కేకలు విని చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్యామసుందర్‌ను స్థానికులు వెంటనే చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ​ఈ ఘటనపై సమాచారం అందుకున్న చర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : ధీమాక్ లేని దీవానా మాటలు మాట్లాడుతున్న కేటీఆర్: చామల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>