కలం, తెలంగాణ బ్యూరో: ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ నిరసన (Delhi Congress Protest)కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ఇందుకోసం ఏఐసీసీ ఉమ్మడి 10 జిల్లాలకు పరిశీలకులను, టీపీసీసీ ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ ను నియమించింది. వీరు ఓటు చోరీ అంశంపై ప్రచారంతో పాటు ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. వారితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ జనసమీకరణ, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాకు 1,000 మంది టార్గెట్..
తెలంగాణ నుంచి 15 వేల మందిని ఢిల్లీకి తరలించాలని రాష్ట్ర కాంగ్రెస్ (Telangana Congress) లక్ష్యంగా పెట్టుకున్నది. ఉమ్మడి పది జిల్లాల వారీగా తరలివెళ్లే వారి జాబితా ఇప్పటికే టీపీసీసీకి చేరింది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 500 మందిని తీసుకురావాలని, ప్రతి జిల్లా నుంచి సుమారు వెయ్యి మందిని సమీకరించాలని డీసీసీ అధ్యక్షులకు పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా పార్టీ నేతలు జనసమీకరణ, ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి సారించారు. పలు జిల్లాల నుంచి పార్టీ శ్రేణుల వివరాలను రాష్ట్ర నాయకత్వానికి అందజేసినట్లు తెలిసింది.
30న హైదరాబాద్ నుంచి రైళ్లు..
జనసమీకరణతో పాటు ప్రయాణ ఏర్పాట్లను కూడా నేతలు సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను ఢిల్లీకి తరలించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవి సరిపోకపోతే అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. మరోవైపు, తమ అనుచరుల కోసం పలువురు నేతలు ఇప్పటికే విమాన టికెట్లు బుక్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మూడ్రోజులు ఢిల్లీలోనే ఎంపీలు..
నవంబర్ 1న జరగనున్న నిరసన ర్యాలీ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఈ నెల 30 నుంచి నవంబర్ 1 వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీకి ముందు, ఆ రోజు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఎంపీలు పాల్గొనేలా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీలంతా అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నాయకత్వం సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జనసమీకరణ, రవాణా, సమన్వయ ఏర్పాట్లను వేగవంతం చేశారు.
‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ఇందుకోసం ఏఐసీసీ ఉమ్మడి 10 జిల్లాలకు పరిశీలకులను, టీపీసీసీ ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ ను నియమించింది. వీరు ఓటు చోరీ అంశంపై ప్రచారంతో పాటు ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. వారితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ జనసమీకరణ, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాకు 1,000 మంది టార్గెట్..
తెలంగాణ నుంచి 15 వేల మందిని ఢిల్లీకి తరలించాలని రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఉమ్మడి పది జిల్లాల వారీగా తరలివెళ్లే వారి జాబితా ఇప్పటికే టీపీసీసీకి చేరింది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 500 మందిని తీసుకురావాలని, ప్రతి జిల్లా నుంచి సుమారు వెయ్యి మందిని సమీకరించాలని డీసీసీ అధ్యక్షులకు పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా పార్టీ నేతలు జనసమీకరణ, ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి సారించారు. పలు జిల్లాల నుంచి పార్టీ శ్రేణుల వివరాలను రాష్ట్ర నాయకత్వానికి అందజేసినట్లు తెలిసింది.