కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)వైఫల్యంపై తీవ్ర చర్చ సాగుతోంది. గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్.. ఎనిమిది బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. క్రీజులో వైభవ్‌కు సీనియర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని అభిప్రాయపడ్డారు.
క్రమశిక్షణతో కూడిన కొత్త పొజిషన్‌లో ఆడుతున్నప్పుడు కుర్రాడికి ధైర్యం చెప్పే బాధ్యతను మిడిలార్డర్ సీనియర్లు తీసుకోలేకపోయారని ఎత్తిచూపారు. మైదానంలో వైభవ్ తీవ్ర ఒత్తిడితో తడబడుతున్న సమయంలో.. సీనియర్ బ్యాటర్ అతడి దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా ఆడమని చెప్పి ఉండాల్సిందని అశ్విన్ (Ravichandran Ashwin) పేర్కొన్నారు. బంతిని జాగ్రత్తగా గమనిస్తూ ఆడాలని దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ ఉన్నప్పుడు.. వైభవ్‌ను మూడో స్థానంలో దించడం సరైన నిర్ణయం కాదని అశ్విన్ వ్యాఖ్యానించారు. సీనియర్‌గా ఉన్న సంజూ శామ్సనే ఆ స్థానంలో వచ్చి బాధ్యత తీసుకుంటే కుర్రాడికి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని సూచించారు. జట్టు గెలిచినప్పటికీ యువ ఆటగాళ్లకు మైదానంలో సీనియర్ల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల పొజిషన్లతో పాటు వారి మానసిక ధైర్యంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందని వివరించారు.
Also Read : ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌తో పోరాడాను: అమిత్ మిశ్రా
Follow Us On: X(Twitter)

