ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

క‌లం, స్పోర్ట్స్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2026 ఫైనల్‌లో భారత స్టార్‌ పీవీ సింధు (PV Sindhu)కు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్‌ వన్‌ ఆన్‌ సె యంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో సింధు తొలి గేమ్‌ గెలిచినా, తర్వాతి రెండు గేమ్స్‌లో తడబడింది. దీంతో 21-16, 11-21, 12-21 తేడాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. తొలి గేమ్‌లో సింధు గట్టి పోటీ ఇచ్చింది. 21-16తో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో ఆన్‌ సె యంగ్‌ పుంజుకుంది. 21-11తో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. సింధు ఒక దశలో ఆధిక్యంలో ఉన్నా, యంగ్‌ వరుస పాయింట్లతో పైచేయి సాధించింది. చివరకు 21-12తో గేమ్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో ఆన్‌ సె యంగ్‌ వరుసగా మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను అందుకుంది. అంతేకాదు, వరుసగా 50వ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు, సింధుకు యంగ్‌ చేతిలో ఇది వరుసగా 11వ ఓటమి. ఈసారి టైటిల్‌ గెలవాలన్న భారత స్టార్‌ ఆశ నెరవేరలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>