కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో నూతనంగా నిర్మించిన పెరిక కుల సంఘం భవనాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల సంఘాల భవనాలు కేవలం పరిమిత కార్యక్రమాలకే కాకుండా ఆయా సామాజిక వర్గాల ఐక్యతకు, ఆర్థిక-సామాజిక అభివృద్ధికి, పరస్పర సహకారానికి ముఖ్య వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. సంఘ భవనాలను సమాజ అభ్యున్నతితో పాటు, నేటి యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడానికి ఉపయోగించుకోవాలన్నారు.
విద్యా, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పెరిక కుల సంఘం (Perika Caste Association) నాయకులు, సభ్యులు ఎల్లప్పుడూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ పట్టణాభివృద్ధిలో, సమాజ పురోగతిలో తమవంతు పాత్ర పోషించాలని బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, పెరిక కుల సంఘం ముఖ్య నాయకులు, సంఘ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Also Read : కోహ్లీ, బుమ్రా లేకుండానే రహానే ఆల్టైమ్ టెస్ట్ టీమ్!
Follow Us On : WhatsApp

