epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బన్నీ, లోకేష్‌ కాంబో వెనుక ఏం జరుగుతోంది..?

కలం, వెబ్​ డెస్క్​ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీ అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బన్నీ మూవీ ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. ఈ నెలలోనే బన్నీ కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటిస్తామని ఇటీవల బన్నీ వాసు ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు సినిమాలు ఫిక్స్ అని చెప్పడంతో.. ఎవరెవరితో బన్నీ సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది.

బన్నీ చేసే రెండు సినిమాల్లో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మరి రెండో సినిమా ఎవరితో అనేది క్లారిటీ రావాల్సివుంది. ఇటీవల బన్నీకి కథ చెప్పడం కోసం.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్​ కనకరాజ్.. హైదరాబాద్ రావడం తెలిసిందే. లోకేష్‌ చెప్పిన స్టోరీ లైన్ కు బన్నీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారట. ప్రస్తుతం లోకేష్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారని.. త్వరలో ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వనున్నారని తెలిసింది. దాదాపుగా అల్లు అర్జున్​ (Allu Arjun), లోకేష్‌ కాంబో ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది.

ఇక బన్నీ, అట్లీ సినిమా విషయానికి వస్తే.. జూన్ లేదా జులైకు బన్నీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. అక్టోబర్ వరకు షూటింగ్ అయ్యే ఛాన్స్ ఉందనేది లేటెస్ట్ న్యూస్. అయితే.. అక్టోబర్ నాటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీతో చేస్తున్న సినిమాని కంప్లీట్ చేసి కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అందుచేత బన్నీ, త్రివిక్రమ్ తో సినిమాని ముందుగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. లోకేష్ స్టోరీకి ఓకే చెప్పినా త్రివిక్రమ్ మూవీ తర్వాతే ఉంటుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>