కలం, వెబ్ డెస్క్: బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం (Bihar Boat Accident) జరిగింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు నది దాటుతుండగా నది మధ్యలో ప్రమాదవశాత్తు దేశీయ పడవ మునిగిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు.. గాలింపు ముమ్మరం చేశాయి. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

