కలం, నిజామాబాద్ బ్యూరో: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి జిల్లా నాయకులతో ముఖ్యమంత్రిని కలిశారు.
సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో నిజామాబాద్ జిల్లా నాయకులు ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, జిల్లాలో పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అరికెల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

