పంటలు వేయొద్దంటూ మంత్రులు ప్రకటించడం దారుణం: సబిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణపై కరువు ప్రభావం పడటంతో రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఆమె మాట్లాడారు. ఎగువ నుండి నీరు వచ్చినా.. పరిపాలన చేతకాక, అసమర్థతతో నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిసిపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ దుయ్యబట్టారు. స్వయంగా రాష్ట్ర మంత్రులే రైతులు రెండో పంట వేయొద్దంటూ ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి, బలవంతంగా రైతుల భూములు లాక్కుంటున్నారని సబిత మండిపడ్డారు. బులెట్ ట్రైన్ అలైన్మెంట్ ఫైనల్ కాలేదని.. భూసేకరణ చేయమని రాష్ట్రాలను చెప్పలేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నాడని గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే అది ఇల్లీగల్ అవుతుందని చెప్పారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బులెట్ ట్రైన్ పేరిట బహుదూర్‌గూడలో భూములు లాక్కుంటుందని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>