సచిన్, యువరాజ్‌లపై వేటు.. జట్టు కోసమే: పాటిల్

కలం, స్పోర్ట్స్​ : టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ జాతీయ జట్టుకు దూరం కావడం వెనుక కారణాలు వారికే తెలుసని మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) తెలిపారు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన పాటిల్.. 2012 నుంచి 2016 వరకు ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహించారు. ఆ సమయంలో 2011 ప్రపంచకప్ విజయం తర్వాత జట్టులో కీలక మార్పులు జరిగాయి. సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశాలు దక్కాయి.

తాజాగా ఓ షోలో మాట్లాడిన పాటిల్ (Sandeep Patil).. ఈ నిర్ణయాలు తాను ఒక్కడినే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకుందని వివరించారు. దేశ ప్రయోజనాలు, బీసీసీఐ, భారత క్రికెట్ భవిష్యత్తుకే తమ కమిటీ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఆటగాళ్లతో వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, జట్టు ఎంపికలో దానికి చోటు ఉండకూడదని పాటిల్ అభిప్రాయపడ్డారు. స్నేహం కారణంగా ఒక ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా బాధ కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పాటిల్​ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>