ఉద్యోగ భద్రత కల్పించాలి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆయుష్‌ వైద్యులు మంగళవారం నిరవధిక సమ్మె (NHM Employees Strike) చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>