బాసరలో కలెక్టర్ పర్యటన.. ఆలయ నిర్మాణం, పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ (Basara Temple) నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం బాసరలో పర్యటించిన కలెక్టర్ ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను జాగ్రత్తగా తొలగించాలని సూచించారు. ఆలయ నిర్మాణ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి నది తీరంలోని పుష్కర ఘాట్లను పరిశీలించి, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్‌ అండ్‌ బీ, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహశీల్దార్ పవన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>