కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) హమాల్ వాడిలో విషాదం చోటుచేసుకుంది. ఉదయం ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకి వెళ్లిన మహిళకు విద్యుత్ షాక్ (Electric Shock) తగిలింది. ఆ ధాటికి మహిళ ముక్కలుముక్కలుగా అయ్యింది. భారీ శబ్ధం రావడంలో ఉలిక్కిపడ్డ స్థానికులు వచ్చి చూసేసరికి మహిళ మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతిచెందిన మహిళను పాత సామాన్లు సేకరించే మహిళగా స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

