కలం, నిర్మల్ : నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆమెడ శ్రీధర్ ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళం (Arya Vysya Mahasabha Vasavi Sevadal) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వాసవి సేవాదళం అధ్యక్షుడు మహంకాళి విజయ్‌కుమార్ గుప్తా సోమవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కమల్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు మొటూరి మురళి గుప్తా, మహాసభ కార్యదర్శి పోలా సుధాకర్ గుప్తా, రాష్ట్ర పొలిటికల్ వైస్ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఈసీ సభ్యుడు పాల్దే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

