సోషల్ మీడియాలో ఆయుధాలతో పోస్టులు.. ఇద్దరి అరెస్ట్‌.

కలం, ఆదిలాబాద్‌ : సోషల్‌ మీడియాలో కత్తులు, ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి వైరల్‌ చేసిన ఇద్దరిని మావల (Mavala) పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న కేఆర్కే కాలనీ సమీపంలో కొందరూ వ్యక్తులు ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై ఎస్సై రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియోలు పోస్టు చేసిన మొహితే వికాస్‌, బండి శశాంక్‌ లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా ఆయుధాలను ప్రదర్శించడం, వాటితో వీడియోలు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సీఐ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>