కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ (Ameenpur) సర్కిల్–47 పరిధిలోని 271వ డివిజన్ శ్రీవాణి నగర్ కాలనీలో CMC కమిషనర్ శ్రీజన IAS సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలను కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిషనర్ స్పందించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కొత్త డ్రైనేజీ లైన్ను వెంటనే మంజూరు చేశారు.
అలాగే కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుపోతుల మహేశ్ గౌడ్, శ్రీవాణి నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు, ఉపాధ్యక్షుడు సుమన్, కాలనీవాసులు పాల్గొన్నారు.

